Monday, November 9, 2009

ఏమిటా..........!

ఎవరి నోటి వెంటనైనా ఈ పదం రాకుండా మాట్లాడతారేమో అని అనుకుంటాను ప్రతీరోజూ, ఎక్కడా, ప్రతీ పూటా ఆ మాట లేకుండా గడవదు, ఆఖరికి నా నోటి వెంట కూడా! వార్తలు వ్రాసే వాళ్ళని వదలం, ఏమిటా రాతలు అనకుండా ఒక్క పత్రిక రావట్లేదు మరి,బుల్లి తెరలో చదివేవాళ్ళూ, భువనచంద్ర గారి మాటల్లో లంగర్లు, లంగరి లు ( హాస్యం పత్రికలో ఓ సారి ఆయన ఈ ముక్క అన్నారు లెండి) వారి ని ఏమిటా చదువడం అనో వారి హావభావాలను గురించో మరోటో మరోటో ఏమిటా అనకుండా ఉండలేం మరి.ఇక మన రేడియో ని వదలం మనం. సినిమాలు సరే సరి, ఏమిటా కధ, ట్విస్టు ఎక్సట్రా ఎక్సట్రా.పోనీ పుస్తకాల జోలికెళ్దాం అంటే అక్కడా షరా మామూలే ఏమిటా రచయిత ఉద్దేశ్యం అంటూ ఏకి పారేస్తున్నారు. క్రియేటివిటీ చచ్చిపోయిందా, రచయితలు కరువయ్యారా, ఇవీ తలగీతలు అదే హెడ్ లైన్స్. మనం ప్రస్తుతం ఓ వింత ట్విస్ట్ లో ఉన్నాం, అన్ని రంగాల్లో కొత్త నీరు వస్తోంది, అదీ మాంచి పవర్ తో చక్కాగా ఆహ్వానిద్దాం, చోటిద్దాం,లేకపోతే ఏమిటా అనేవాళ్ళే మిగుల్తారు ఈ ప్రపంచంలో.

అంతర్జాలము లో అన్నయ్య........

అంతర్జాలము లో బోల్డు మాట్లాడేసుకుంటున్నాము, మరి అన్నయ్య ఏడీ అనిపించింది ట మొన్నామధ్య ఓ బ్లాగర్ కి, సరే ఆలస్యం దేనికి ఒరేయ్ అన్నయ్యా మరి ఇక నువ్వు అడుగు పెట్టూ అంటేనూ, వచ్చేసాను.ఇక బ్లాగుతాను.